ADB: మావల మండలంలోని జాతీయ రహదారితో పాటు బట్టి సవర్గామ గ్రామ సమీపంలోని సర్వీస్ రోడ్డుకు ఇరువైపులా సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి వేళల్లో ప్రయాణం సౌకర్యవంతంగా మారిందని వాహనదారులు పేర్కొన్నారు. అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడంతో దొంగతనాలు, ప్రమాదాలు తగ్గుతాయని స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
సోలార్ లైట్ల ఏర్పాటుతో వాహనదారుల హర్షం


