హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో 22 నుంచి ఉద్యోగుల క్రీడా పోటీలు

KDP: ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు కడపలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు నిర్వహించనున్నారు. డీఎస్ఏ ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాల్లో 19 క్రీడాంశాల్లో ఈ ఎంపికలు జరగనున్నట్లు డీఎల్డీవో షేక్ గౌస్‌బాషా వెల్లడించారు. ఆసక్తి ఉన్న ఉద్యోగులు తమ శాఖకు సంబంధించిన గుర్తింపు కార్డుతో నేరుగా హాజరుకావచ్చని సూచించారు.