TG: విద్యుత్ సంక్షోభానికి పాలకుల చేతగానితనమే కారణమని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. విద్యుత్ సమస్యను అధికారులపై నెట్టడం సరికాదన్నారు. తప్పులు చేసి అధికారులపై నెపం వేయడం సీఎం, మంత్రులకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. బొగ్గు నిల్వలు కూడా సమకూర్చుకోకుండా విద్యుత్ సంక్షోభానికి కారణమయ్యారని ఆరోపించారు. విద్యుత్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే కరెంట్ కోతలు ఏర్పడ్డాయన్నారు.
వార్తలు
విద్యుత్ సంక్షోభానికి పాలకులదే బాధ్యత: హరీష్ రావు


