హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ రెజ్లింగ్ పోటీలకు గరివిడి విద్యార్థిని

VZM: శ్రీరాం నగర్(గరివిడి)ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న సింగపురపు లక్ష్మీ అండర్ 14 విభాగంలో జాతీయ రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యింది. పల్నాడు జిల్లాలో జరిగిన స్కూల్ గేమ్స్ పోటీల్లో రెజ్లింగ్ లో ప్రథమ స్థానాన్ని సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం గురువారం తెలిపారు. ఈ నెలాఖరులో న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ స్ధాయి పోటీల్లో లక్ష్మీ పాల్గొననున్నారు.