అనకాపల్లి జిల్లాలో గురువారం ఉదయం 8:30 గంటల వరకు సగటున 6.6 మి.మీ వర్షపాతం రికార్డైంది. పరవాడలో అత్యధికంగా 36.8 మి.మీ, సబ్బవరంలో 35.0, కె.కోటపాడులో 28.2 మి.మీ వర్షం పడింది. అచ్యుతాపురం, మునగపాక సహా 14 మండలాల్లో వర్షం కురవగా, 10 మండలాల్లో పొడి వాతావరణం ఉందని రెవెన్యూ శాఖ తెలిపింది. కాగా అక్టోబరులో ఇప్పటివరకు సాధారణం కంటే 74.6 శాతం లోటు కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
వర్షపాతం నమోదు వివరాలు ఇవే!


