పేపర్ లీక్లను ఆపేందుకు చివరి నిమిషంలో AIతో ప్రశ్నాపత్రం రూపొందించాలన్న నందన్ నీలేకని సూచనపై 'సూపర్ 30' ఆనంద్ కుమార్ అభ్యంతరం తెలిపారు. నీలేకనిపై గౌరవమున్నా.. పేద విద్యార్థులకు కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం, మౌలిక వసతుల కొరత, AI ప్రశ్నల్లో తప్పులు దొర్లే ఛాన్స్ ఉందని 'X'లో తెలిపారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలే తప్ప, పేద పిల్లలకు కొత్త అడ్డంకులు సృష్టించవద్దన్నారు.
వార్తలు
AI ప్రశ్నాపత్రం.. 'సూపర్ 30' ఆనంద్ అభ్యంతరం


