హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులి మృతి కేసులో ముగ్గురికి బెయిల్!

ప్రకాశం: రాచర్ల మండలంలోని జేపీ.చెరువు సమీప నల్లమల అటవీ ప్రాంతంలో పులి అనుమానాస్పద మృతి కేసులో అరెస్ట్‌ అయిన ఏడుగురిలో ముగ్గురు చెంచులకు బుధవారం బెయిల్ మంజూరైంది. మార్కాపురం ఆరో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. దర్శికి చెందిన ఏపీ హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ వారికి ఉచితంగా న్యాయసహాయం అందించారు. ఆయన పోరాటంతో వారికి బెయిల్ లభించింది.