హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

VZM: గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని వైద్య చికిత్స నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.