హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన ప్రత్యేక విభాగాన్ని తనిఖీ చేసిన ITDA PO

విశాఖపట్నం కేజీహెచ్‌లోని గిరిజన ప్రత్యేక విభాగాన్ని పాడేరు ఐటీడీఏ పీవో బి. ఆదిత్య వర్మ నిన్న తనిఖీ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన రోగులకు అందుతున్న వైద్యం, మందుల సరఫరాపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, హెల్ప్‌డెస్క్ ద్వారా రోగులకు సహకరించాలని వైద్యాధికారులను ఆదేశించారు.