హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

BPT: రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిన్నగంజాం మండలంలోని వివిధ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఎస్సై జి.సురేష్ సందర్శించి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్రాల్లోని పరిస్థితులు, వసతులను సమీక్షించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలపై దృష్టి సారించారు.