హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గజలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనం

NLR: నెల్లూరు నగరంలోని దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రి వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం అమ్మవారు గజలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా ఉదయం నుంచే భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.