హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాజకీయ పార్టీల బ్యానర్లు జెండాల తొలగింపు

AKP: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ ఈరోజు ఉదయం నుంచి మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలు కట్టిన బ్యానర్లను, జెండాలను తొలగిస్తున్నారు. రాజకీయ పార్టీ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసే పని మొదలుపెట్టారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ జంప సురేంద్ర తెలిపారు.