హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లలితా త్రిపుర సుందరి దేవిగా గంగానమ్మ అమ్మవారు

ELR: జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన గురువారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులను ఆకట్టుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.