ప్రకాశం: మార్కాపురం, గిద్దలూరు మండలం, క్రిష్టంశెట్టిపల్లె గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా నుజ్జునుజుగా మారడంతో మృతుడి వివరాలు గుర్తించడం కష్టంగా మారింది. మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి


