హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణ రహదారులపై ప్రమాదకర మలుపులు

PDPL: మంథని మండలంలోని గ్రామీణ రహదారులపై మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. కాకర్లపల్లి నుంచి ముత్తారం మండలం సీతంపల్లి మధ్య రహదారిపై పలుచోట్ల మలుపులు ఉన్నాయి. రచ్చపల్లి–సూరయ్యపల్లి మధ్య మలుపుల వద్ద ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారులు స్పందించి మొక్కలను తొలగించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు.