హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దతుంబళం ఎస్సైగా విజయ్ కుమార్ నాయక్

KRNL: ఆదోని మండలం పెద్దతుంబళం ఎస్సైగా కే. విజయ్ కుమార్ నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు, బాల్య వివాహాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు.