హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు 31 వరకు గడువు'

KDP: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈవో షంషుద్దీన్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్మీడియట్‌లో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. చదువును మధ్యలో మానేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.