హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు దుర్గమ్మకు చంద్రబాబు పట్టు వస్త్రాలు

AP: దసరా ఉత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారికి రేపు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య సీఎం అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.