హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయికి ఎంపికైన జిల్లా వాసి

SKLM: నరసన్నపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి చంచిలి రోహిత్ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. నగిరిలో ఈనెల 12 వరకు జరిగిన అండర్-19 పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడని జిల్లా శిక్షకుడు గోపి గంగూలి, కొత్తపల్లి వ్యాయామోపాధ్యాయుడు, మేనేజర్ ఆనంద్ కిరణ్ తెలిపారు. రోహిత్ ఎంపికపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు.