TG: HYDలోని హుస్సేన్సాగర్లో కన్నతల్లే నెట్టేసిన చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి అఫ్సర్లను సీపీ సజ్జన్నార్ సత్కరించారు. వీడియోలు తీసే కాలంలో ఈ హీరోల సాహసం నిజమైన మానవత్వానికి నిదర్శనమన్నారు. ఎంతటి కష్టమొచ్చినా కన్నబిడ్డల ప్రాణాలు తీయడం పరిష్కారం కాదని, నైరాశ్యంలో సమాజ సాయం కోరాలని తెలిపారు.
వార్తలు
ఈ హీరోలకు నా సెల్యూట్: సజ్జనార్


