TG: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు ప్రతీక అని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. DGP కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన సిబ్బందితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ బతుకమ్మ జరుపుకోవడం మన ప్రత్యేకతని, ఇది ఆడపడుచుల ఆత్మీయతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ భగవత్, స్వాతి లక్రా, అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
'తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ'


