హైదరాబాద్: 28°C
వార్తలు

స్వచ్ఛ ఇంధనమే సుస్థిర అభివృద్ధికి మార్గం: వివేక్

TG: సుస్థిర అభివృద్ధికి స్వచ్ఛమైన ఇంధనం, పునరుత్పాదక వనరుల వినియోగమే కీలకమని మంత్రి వివేక్‌ వెంకటస్వామి స్పష్టం చేశారు. HYDలో BIS ఆధ్వర్యంలో జరిగిన 'వరల్డ్‌ స్టాండర్డ్స్‌ డే'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో బొగ్గు లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచాలని సూచించారు.