పశ్చిమ బెంగాల్ సిలిగుడిలో ఏర్పాటు చేసిన దుర్గా మాత మండపం భక్తులను ఆకర్షిస్తోంది. సెంట్రల్ కాలనీ దుర్గా పూజా కమిటీ 64వ వార్షికోత్సవం సందర్భంగా దేవతా విగ్రహాలను 120 కిలోల స్వర్ణాభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. దుర్గమ్మతో సహా లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడు, కార్తికేయ, ఇతర దేవతామూర్తుల విగ్రహాలను అలంకరించారు. వీటి విలువ రూ.170 కోట్లు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.
వార్తలు
దేవతామూర్తులకు 120 కిలోల స్వర్ణాభరణాలతో అలంకరణ


