హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్త్రీనిధి రుణాల రికవరీ, పంపిణీ లక్ష్యాలు పూర్తి చేయాలి: కలెక్టర్

నారాయణపేట కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో స్త్రీనిధి రుణాల రికవరీ, క్రెడిట్ పంపిణీ లక్ష్యాలను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. దసరా నాటికి పంపిణీ, డేటా ఎంట్రీ ప్రక్రియను 100% పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తక్కువ ప్రగతి ఉన్న మండలాలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్ల (సీసీ) పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.