ASF: భూ భారతి నూతన మాడ్యూల్పై తహసీల్దార్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం రెవెన్యూ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సాదా బైనామా దరఖాస్తులు, భూముల రీ-సర్వే, ధ్రువపత్రాల జారీ, ఓటరు జాబితా సవరణను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
భూ భారతి మాడ్యూల్పై కలెక్టర్ సమీక్ష


