హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాచండీ దేవి అలంకారంలో అమ్మవారు

KMM: నగరంలోని పలు ఆలయాల్లో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాలుగో రోజు అమ్మవారు మహాచండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.