MDCL: ఫీర్జాదిగూడ బుద్ధానగర్‌కు చెందిన ఏడో నెల గర్భిణీకి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రం కావడంతో ENT నాగరాజు, పైలట్ ఉపేందర్ వైద్యుల సూచనలతో అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
108 అంబులెన్స్‌లో గర్భిణీకి ప్రసవం


