హైదరాబాద్: 28°C
తెలంగాణ

చటాన్‌పల్లి బ్రిడ్జి పనుల కోసం దీక్ష

RR: చటాన్‌పల్లి రైల్వే బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు షాద్‌నగర్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. తీన్మార్ మల్లన్న ఆదేశాలతో ఉప్పరమోని రాములు, ఎమ్మే సంతోష్ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. పనులు నిలిచిపోవడంతో 20 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు.