హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉద్యోగుల ధర్నా!

MNCL: చెన్నూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట బుధవారం కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా చేశారు. వంద పడకల ఆసుపత్రిని 50 పడకలకు కుదించడంతో తమ వేతనాల్లో కోత పడిందని ఆవేదన చెందారు. స్పందించకపోతే రిలే నిరాహార దీక్షలు చేస్తామని సంఘం అధ్యక్షుడు ఎనగందుల శ్రీనివాస్ హెచ్చరించారు. సూపరింటెండెంట్ సత్యనారాయణకు ఈ విషయమై వినతిపత్రం అందజేశారు.