MDCL: జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ప్రిన్సిపల్ జి. అరుంధతి, అధ్యాపకులు, విద్యార్థులు సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. కళాశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
తెలంగాణ
మేడ్చల్ పాలిటెక్నిక్లో బతుకమ్మ సందడి


