హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీటీ రోడ్డుపై సూచిక బోర్డులు కరువు

VKB: దుద్యాల మండల కేంద్రం నుంచి సాగారం తండా వరకు నాణ్యతా ప్రమాణాలతో బీటీ రోడ్డు నిర్మించారు. అయితే రహదారిపై మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళ ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి, మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.