హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారిని రక్షించిన ముగ్గురికి ప్రశంసలు

HYD: హుస్సేన్‌సాగర్‌లో ఆరేళ్ల చిన్నారిని కాపాడిన ఫక్రుద్దీన్, బాలకృష్ణ, అఫ్సర్‌లను సీపీ వీసీ సజ్జనార్ అభినందించారు. తల్లి సాగర్‌లోకి నెట్టేయగా, తమ ప్రాణాలను పణంగా పెట్టి చిన్నారిని రక్షించిన వారి తెగువను ప్రశంసించారు. కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లల ప్రాణాలు తీయడం పరిష్కారం కాదని, సమాజం సాయం కోరాలని సూచించారు.