హైదరాబాద్: 28°C
తెలంగాణ

మసీద్-ఏ-మొహమ్మదియాకు హైకోర్టు ఊరట

HYD: చింతల్మెట్‌లోని మసీద్-ఏ-మొహమ్మదియాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మసీదు ప్రాంగణం, ప్రహరీ గోడను కూల్చవద్దని, బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది. మసీదు మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ బషీర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్. నందా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.