KNR: మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వ్యవస్థాపకులు కల్లెం మల్లారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సహకార రంగంలో ఆయన కృషి ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం : ఎమ్మెల్యే సత్యం


