హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎండిన వరి పంటలను పరిశీలించిన ఎమ్మార్వో

KMR: రామారెడ్డి మండలం గోగుల్ తాండ శివారులో ఎండిన వరి పంట పొలాలను బుధవారం తహశీల్దార్ ఉమలత, కోఆపరేటివ్ చైర్మన్ లింగ గౌడ్ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎండిన పంటలపై నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.