పెద్దపల్లి: పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు జెర్సీలు, బ్యాట్లు అందజేశారు. అనంతరం గ్రామంలో దుర్గాభవాని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
రాఘవాపూర్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే


