హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి పట్టివేత..కల్వకుర్తి వాసి అరెస్ట్

NGKL: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని కేటీఆర్ కాలనీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించగా 4.375 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన మహమ్మద్ యూసుఫ్ ఖాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.25 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.