BHPL: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 17న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మానుపాటి మల్లయ్య తెలిపారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 18–35 ఏళ్ల వారు అర్హులన్నారు. వేతనం రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు ఉంటుందన్నారు. అభ్యర్థులు సర్టిఫికెట్ల జిరాక్స్లతో ఐడీఓసీ ఎఫ్3 బ్లాక్లోని జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలన్నారు.
తెలంగాణ
ఈ నెల 17న భూపాలపల్లిలో జాబ్ మేళా


