జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం గంగన్పల్లిలో కుర్వ కర్రెప్ప (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అనుమానాస్పదంగా యువకుడి మృతి


