హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు భూ పట్టాలు పంపిణీ

ASR: ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా బుధవారం హుకుంపేట మండలం గన్నేరుపుట్టు పంచాయతీ గంగూడి రెవెన్యూ గ్రామంలో 106 మంది రైతులకు రాజముద్రతో కూడిన భూ పట్టాలను పంపిణీ చేశారు. సమగ్ర భూ సర్వేతో భూముల కొలతలు, సరిహద్దుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మాజీ వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు తెలిపారు. పట్టాలు రైతులకు భరోసా, హక్కు కల్పిస్తాయని పేర్కొన్నారు.