ASR: అనంతగిరి మండలం కొండిభ పంచాయతీ రంజనివలస గ్రామానికి చెందిన కొర్రా కమల అనారోగ్యంతో ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు డోలీ కట్టి మృతదేహాన్ని తరలించారు. దీంతో చచ్చినా.. బతికినా గిరిజనులకు డోలీ మోత తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డోలీలో మృతదేహాం తరలింపు


