కోనసీమ: జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కే. నాగశ్రీనివాసు ఆత్రేయపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రక్త పరీక్షల ల్యాబ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులకు సంబంధించిన రక్త పరీక్షల నిర్వహణను పరిశీలించి, ల్యాబ్ రికార్డులను తనిఖీ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్కు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీహెచ్సీ ల్యాబ్లో మలేరియా అధికారి తనిఖీ


