హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెడనలో ZPTC రిజర్వేషన్లు ఖరారు

కృష్ణా: పెడన నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు ZPTC స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పెడన మండలం BC మహిళకు, గూడూరు జనరల్ మహిళకు కేటాయించారు. అలాగే బంటుమిల్లి మండలం BC జనరల్‌కు, కృత్తివెన్ను జనరల్‌కు ఖరారు కావడం జరిగింది. రిజర్వేషన్లు స్పష్టం కావడంతో ఆయా మండలాల్లో పోటీ చేసేందుకు స్థానిక నాయకులు సిద్ధమవుతున్నారు.