తూ.గో: అర్హులైన ఉపాధ్యాయులందరూ నవంబర్ 6లోగా ఫారం-19 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్ రెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితాల తయారీని పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. అర్హత తేదీకి ముందు ఆరేళ్లలో కనీసం మూడేళ్లు పూర్తికాలం ఉపాధ్యాయులుగా పనిచేసిన వారే అర్హులని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'నవంబర్ 6లోగా ఉపాధ్యాయ ఓటరుగా నమోదు చేసుకోవాలి'


