హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కున్న డబుల్ డెక్కర్ బస్

తూ.గో: రాజమండ్రిలో తాడితోట నుంచి స్టేడియం రోడ్డుకు వెళ్లే మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద డబుల్ డెక్కర్ స్లీపర్ కోచ్ బస్సు గడ్డర్ల మధ్య ఇరుక్కుంది. దీంతో సుమారు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. చివరకు బస్సును వెనక్కి పంపించి మరో మార్గంలో మళ్లించారు.