హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ స్థలంపై ఆక్రమణ యత్నం

PLD: నరసరావుపేటలో ఎన్జీవో కాలనీలో సుమారు 40సెంట్ల విలువైన మున్సిపల్ స్థలం చుట్టూ పరదాలు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయ నిర్మాణం పేరుతో భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.