హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల నేపథ్యంలో విస్తృత కార్డన్‌ అండ్‌ సెర్చ్‌

GNTR: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందల్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో బుధవారం తెల్లవారుజామున విస్తృతంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు నిర్వహించారు. సంబంధిత డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, సివిల్‌ పోలీసు సిబ్బంది, ప్రత్యేక బలగాల సిబ్బంది సమన్వయంతో తనిఖీలు చేపట్టారు.