కాకినాడ: తుని తలుపులమ్మ అమ్మవారి లోవ క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న ఎస్కలేటర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మెట్లు ఎక్కలేని వృద్ధులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ ఏర్పాటు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. మెట్ల బిగింపు పూర్తికాగా, షెడ్ నిర్మాణం మినహా మిగిలిన పనులు పూర్తయ్యాయి. మరో 30 రోజుల్లో ఎస్కలేటర్ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లోవ క్షేత్రంలో త్వరలో ఎస్కలేటర్ ప్రారంభం!


