హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి'

NDL: నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో బుధవారం DRO రాము నాయక్‌ను కలిసి APWJF, APBJA నాయకులు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రత్యేక జీవో అమలు చేయాలని కోరారు. జర్నలిస్టుల భద్రత చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో APWJF, APBJA సంఘాల నాయకులు పాల్గొన్నారు.