హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

WG: పంచారామక్షేత్రం పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు గిరీష్, మల్లేశ్వరి భక్తులు, ఆలయ సిబ్బందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారని ఆలయ ఈవో రాపాక శ్రీనివాస రావు తెలిపారు.